AP లో 300 పోస్టులకి అతి పెద్ద నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఉద్యోగ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
వైద్య ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 14 స్పెషాలిటీలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చేనెల 5,7,10 తేదీల్లో ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 5 వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ,మైక్రోబయాలజీ, మెడిసిన్. 7వ తేదీన గైనకాలజీ, అనస్తీసియా, పథలాజీ,ఈఎన్టీ, 10 వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ రేడియాలజీ స్పెషాలిటీ వారిగా ఇంటర్వ్యూలు ఉంటాయి.


📌పోస్టుల ఖాళీలు :
300
📌ఉద్యోగ వివరాలు :
గైనకాలజీ -33
పీడియాట్రిక్స్- 25
అనస్థీషియా -40
జనరల్ మెడిసిన్ -63
సాధారణ శస్త్రచికిత్స -33
ఆర్థోపెడిక్స్- 06
పాథాలజీ -08
నేత్ర వైద్యం- 15
రేడియాలజీ -39
డెర్మటాలజీ -10
మైక్రోబయాలజీ -01
ENT -21
ఫోరెన్సిక్ మెడిసిన్- 05
ఛాతీ వ్యాధి -01
📌అర్హత
అభ్యర్థులు PG డిగ్రీ/ డిప్లొమా/ DNB కలిగి ఉండాలి
📌ముఖ్యమైన తేదీలు
ఇంటర్వ్యూ తేదీ : 05-09-2023 & 07-09-2023 & 09-09-2023



English Hindi Telugu