రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి అవకాశం

రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ లో 581హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆పోస్టుల ఖాళీలు-581◆

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఖాళీగా ఉన్న 581 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్, వార్డెన్‌, మ్యాట్ర‌న్ పోస్టుల‌తో పాటు మ‌హిళా సూప‌రింటెండెంట్ పోస్టుల‌ భ‌ర్తీ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 6 నుంచి 27వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

పోస్టుల ఖాళీలు

-హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) -05

-హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 106

-హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) -70

-హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) – 228

-హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140

-వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05

-మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03

-వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03

-మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02

-లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19

English Hindi Telugu