ఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION

వైద్య ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 14 స్పెషాలిటీలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

వచ్చేనెల 5,7,10 తేదీల్లో ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 5 వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ,మైక్రోబయాలజీ, మెడిసిన్. 7వ తేదీన గైనకాలజీ, అనస్తీసియా, పథలాజీ,ఈఎన్టీ, 10 వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ రేడియాలజీ స్పెషాలిటీ వారిగా ఇంటర్వ్యూలు ఉంటాయి.గుంటూరు జిల్లా తాడేపల్లి లోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రెగ్యులర్,కాంట్రాక్టు విధానంలో వైద్యులు నియమించనున్నారు.


English Hindi Telugu